Arya Marriage : మలయాళంలో టాప్ యాంకర్ గా ఉన్న ఆర్య ప్రస్తుతం నటిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే పెళ్లి 12 ఏళ్ల కూతురు ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ సిబిన్ ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. గత మే నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. విశేషం ఏంటంటే ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి ఈ పెళ్లిలో అన్నీ దగ్గరుండి చూసుకుంది. తన తల్లిని మండపం వద్దకు స్వయంగా తీసుకొచ్చింది. తాళి కట్టే సమయంలో పక్కనే ఉండి సంతోషంగా నవ్వింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : TVK Chief Vijay : స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న టీవీకే చీఫ్ విజయ్
దీంతో ఈ కొత్త జంటకు అంతా విషెస్ చెబుతున్నారు. ఆర్యకు గతంలో నటి అర్చన సోదరుడు, ఇంజినీర్ అయిన రోహిత్ సుశీలన్ తో పెళ్లి అయింది. కూతురు రోయా పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నట్టు తెలిపింది ఆర్య. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది. కొరియోగ్రాఫర్ సిబిన్ తో చాలా కాలంగా ఆమెకు ఫ్రెండ్షిప్ ఉంది. సిబిన్ కు కూడా గతంలో పెళ్లి అయి విడాకులు అయ్యాయి. అప్పటి నుంచే ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్య మలయాళంలో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది.
Read Also : TVK Chief Vijay : సింహం వేట మొదలైంది.. డీఎంకేతోనే పోటీ : విజయ్
