Site icon NTV Telugu

Ahana Krishna : లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?

Ahana

Ahana

Ahana Krishna : హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనడం షరా మామూలే కదా. పైగా వాళ్ల బర్త్ డేలకు ఇలాంటి గిఫ్ట్ లు సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా కోరుకున్న లగ్జరీ కారైన BMW X5ని ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని అహానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. “20’s నుంచి 30’sలోకి అడుగుపెడుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కొత్త ఏజ్ కు వెల్కమ్ చెబుతున్నా. లైఫ్ లో ఏం చేయాలి అనే విషయంలో మొన్నటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు. సినిమాలు చేస్తూ ఉండగానే ఈ టైమ్ గడిచిపోయింది అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చింది.

Read Also : Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్

నా లైఫ్‌ లో నా కుటుంబానికి థాంక్స్. “ఇప్పటి వరకు నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో అని ఎప్పుడూ కండీషన్లు పెట్టకుండా నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కచ్చితంగా ఇది కావాలి అని కోరుకోకుండానే అది వాళ్లు నాకు ఇచ్చారు. ఇక బర్త్ డేకు కార్ కొనాలి అనుకున్నప్పుడు ఏం కొనాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే దుల్కర్ సల్మాన్ సలహా తీసుకున్నా. ఏ మోడల్ బాగుంటుందో, ఏది సరిపోతుందో అన్న విషయాల్లో అతనే సలహాలు ఇచ్చాడు. తెలిపింది ఈ బ్యూటీ. ఇక ఆమె కొన్న కారు ధర సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. ఆమె చిన్నప్పటి నుంచే సీరియల్స్ లో నటిస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. రీసెంట్ గా వచ్చిన కొత్త లోక: చాప్టర్ 1 లో గెస్ట్ రోల్ చేసింది.

Read Also : FatimaSanaShaikh : శారీలో షేక్.. షేక్ ఆడిస్తున్న ఫాతిమా సనా ఖాన్

Exit mobile version