Site icon NTV Telugu

Sreenivasan: వెంటిలేటర్ పై ప్రముఖ నటుడు

Srinivasan

Sreenivasan

ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్  ఆసుపత్రి పాలయ్యారు. మళయాలంలో నటుడిగాఎం స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ కు మార్చి 30 న గుండెపోటు రావడంతో  కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇక మార్చి 31 న ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు, ఆ తరువాత ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇకపోతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీనివాసన్ పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారని సమాచారం. దీంతో శ్రీనివాసన్ అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన  చెందుతున్నారు. ఇకపోతే శ్రీనివాసన్ మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన  ఆరు సార్లు కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక శ్రీనివాసన్ పెద్ద కొడుకు వినీత్ శ్రీనివాసన్ సింగర్ గా కొనసాగుతుండగా.. చిన్న కొడుకు ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.

Exit mobile version