NTV Telugu Site icon

PVT04: అప్పుడు కోలీవుడ్ హీరో.. ఇప్పుడు మాలీవుడ్ హీరో.. బావుందయ్యా వైష్ణవ్

Pvt

Pvt

PVT04: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో కుర్ర హీరోకు తీరుగులేదు అనుకున్నారు. కానీ, మొదటి సినిమా తరువాత రిలీజ్ అయిన కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లాపడ్డాయి. దీంతో వైష్ణవ్.. తన తరువాతి సినిమాలను ఆచితూచి ఎంచుకొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకుడితో ఒక కొత్త సినిమాను ప్లాన్ చేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో వైష్ణవ్ PVT04 అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వైష్ణవ్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన లక్కీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.

NTR: అందరి కంటే ముందే వచ్చేసిన ఎన్టీఆర్.. కారణం అదేనా..?

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నటుడును పరిచయం చేశారు. మలయాళంలో మంచి నటుడిగా మెప్పిస్తున్న జోజు జార్జ్ ను రంగంలోకి దించారు. ఈ మధ్యనే ఇరట్ట సినిమాతో హిట్ కొట్టిన జోజు పేరు మలయాళంలో మారుమ్రోగిపోతుంది. ఈ సినిమాలో హీరోకు పోటీగా ఉండే పాత్ర కావడంతో ఆయన విలన్ గా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. చెంగా రెడ్డి అనే పాత్రలో జోజు కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” PVT04 లో జోజు జార్జ్ ను క్రూరమైన, అతి భయంకరమైన సమస్యలను సృష్టించే చెంగారెడ్డిగా పరిచయం చేస్తున్నాం. ఇరట్ట విజయం సాధించినందుకు అభినందనలు, జోజు సార్! పెద్ద స్క్రీన్‌పై మీ క్రూరత్వాన్ని మరింతగా చూసేందుకు వేచి ఉండలేను” అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వైష్ణవ్ మొదటి సినిమా ఉప్పెన కోసం కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని విలన్ గా దింపారు.. అది సూపర్ హిట్. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మాలీవుడ్ హీరోను రంగంలోకి దించుతున్నారు.. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.