NTV Telugu Site icon

Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..

Malavika

Malavika

మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది.

Also Read : Sandal Wood : ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా మారిన యంగ్ హీరో

2013లో వచ్చిన మలయాళ మూవీ పట్టంపోలేతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ కుట్టీ బియాండ్ ది క్లౌడ్స్‌తో బాలీవుడ్, పెట్టాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఓ కన్నడ మూవీలోనూ ఆడిపాడింది. మాస్టర్, మారన్, క్రిస్టీ చిత్రాలతో ఓకే అనిపించుకుంది కానీ ఆమెకు కాస్తో కూస్తో ఐడెంటిటీ తెచ్చిన మూవీ తంగలాన్. ఇందులో డీ గ్లామర్ రోల్‌కే పరిమితమైంది ఇదే టైంలో తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్‌లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సినిమా రిలీజైతే.. డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో దూసుకెళ్లిపోవచ్చు అనుకుంది. కానీ తానొకటి అనుకుంటే మరోటి జరుగుతోంది. సినిమా అనుకున్న టైంకి రావట్లేదని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. రాజా సాబ్ డిలే అయితే అయ్యిందిలే తమిళంలో కార్తీ సర్దార్ 2 చకా చకా షూటింగ్ జరుపుకుంటోంది మే ఎండింగ్‌కు రావడం పక్కా అనుకుంటున్న టైంలో సర్దార్ 2 షూటింగ్‌లో హీరో కార్తీకి లెగ్ ఇంజ్యూరీ కావడం డాక్టర్స్ రెస్ట్ అనడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న టైంకి సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఈ రెండే కాకుండా మేడమ్ చేతిలో మరో ప్రాజెక్ట్‌ ఉంది. సీనియర్ హీరో మోహన్ లాల్‌తో హృదయ పూర్వంలో ఆడిపాడుతోంది ఈ మాలీవుడ్ సోయగం. రీసెంట్లీ పట్టాలెక్కింది మూవీ. ఆగస్టు 25న రిలీజ్ ప్లానింగ్ లో ఉంది. మరీ ఇదేనా అనుకున్న టైంకి వస్తుందో రాదో..?