Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది.
Also Read : Sandal Wood : ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా మారిన యంగ్ హీరో
Also Read
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
2013లో వచ్చిన మలయాళ మూవీ పట్టంపోలేతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ కుట్టీ బియాండ్ ది క్లౌడ్స్‌తో బాలీవుడ్, పెట్టాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఓ కన్నడ మూవీలోనూ ఆడిపాడింది. మాస్టర్, మారన్, క్రిస్టీ చిత్రాలతో ఓకే అనిపించుకుంది కానీ ఆమెకు కాస్తో కూస్తో ఐడెంటిటీ తెచ్చిన మూవీ తంగలాన్. ఇందులో డీ గ్లామర్ రోల్‌కే పరిమితమైంది ఇదే టైంలో తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్‌లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సినిమా రిలీజైతే.. డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో దూసుకెళ్లిపోవచ్చు అనుకుంది. కానీ తానొకటి అనుకుంటే మరోటి జరుగుతోంది. సినిమా అనుకున్న టైంకి రావట్లేదని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. రాజా సాబ్ డిలే అయితే అయ్యిందిలే తమిళంలో కార్తీ సర్దార్ 2 చకా చకా షూటింగ్ జరుపుకుంటోంది మే ఎండింగ్‌కు రావడం పక్కా అనుకుంటున్న టైంలో సర్దార్ 2 షూటింగ్‌లో హీరో కార్తీకి లెగ్ ఇంజ్యూరీ కావడం డాక్టర్స్ రెస్ట్ అనడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో అనుకున్న టైంకి సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఈ రెండే కాకుండా మేడమ్ చేతిలో మరో ప్రాజెక్ట్ ఉంది. సీనియర్ హీరో మోహన్ లాల్‌తో హృదయ పూర్వంలో ఆడిపాడుతోంది ఈ మాలీవుడ్ సోయగం. రీసెంట్లీ పట్టాలెక్కింది మూవీ. ఆగస్టు 25న రిలీజ్ ప్లానింగ్ లో ఉంది. మరీ ఇదేనా అనుకున్న టైంకి వస్తుందో రాదో..?
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!