ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మేకర్స్ కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల కాలంలో మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” నుంచి ఏకంగా సాంగ్ మొత్తం లీక్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేనా నిన్నటికి నిన్న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్” సాంగ్ నుంచి కూడా ఒక చిన్న బిట్ లీక్ అయ్యి నెట్టింట్లో సంచలనం సృష్టించింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి లీకులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలు చేసుకుంటున్నారు. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ఏకంగా సోషల్ మీడియా ద్వారా తన రాబోయే చిత్రానికి సంబంధించి లీక్ రాయుళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
Read also : Chiranjeevi : తీవ్ర ఆవేదన… ఆయన లేని లోటు తీరనిది
“#RC15 #SVC50 చిత్రీకరణ సినిమా అవసరాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జనసందోహంతో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, చట్టవిరుద్ధంగా తీసిన షూటింగ్ చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాము. అనధికారిక కంటెంట్‌ను పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ పైరసీ టీమ్ చర్య తీసుకుంటుంది” అంటూ లీక్ చేసిన వాళ్ళ పని అంతేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇక RC15 విషయానికొస్తే… రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా… శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, తిర్రు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్ చరణ్‌కు రాజమండ్రి ప్రజలు ఘనస్వాగతం పలికారు.
