Site icon NTV Telugu

Major: సినిమా చూసి థియేటర్లోనే ఏడ్చేసిన ప్రేక్షకులు.. ‘మేజర్’ అమర్ రహే

Major

Major

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలోశశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”మేజర్”. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు మలయాళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.  2008 నవంబర్ లో ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ ఘటన ప్రస్తుతం మరోసారి సినిమా ద్వారా సంచలనం సృష్టిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక ఈ నేపథ్యంలోనే పలువురు యుద్ధ వీరులకు సినిమాను స్పెషల్ స్క్రీనింగ్స్  వేసి చూపించారు. ఇక సరికొత్తగా ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు మేకర్స్. దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ని కండక్ట్ చేయడం మొదలు పెట్టింది.

తాజాగా ఈ మూవీ ప్రీ స్క్రీనింగ్ జైపూర్ లో జరిగింది. అక్కడ ‘మేజర్’ మూవీకి భారీ ఆదరణ లభించింది. ఆ వీడియోను శేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆ వీడియోలో మేజర్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకోవడం గమనార్హం. ముఖ్యం తన పాపతో అచ్చిన ఒక మహిళ ఉన్ని కృష్ణన్ మరణాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇక సినిమా అయిపోయినా తరువాత ప్రతి ఒక్కరు  లేచి దేశ రక్షణ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులని చూసి అమర్ రహే అంటూ నినాదాలు చేయడం గర్వించదగ్గ విషయం. ” ప్రేక్షకులు  జైపూర్ లో ఈ మూవీని చూస్తూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే అంటూ నినాదాలు చేయడం చూశాను. ఇది నా జీవితంలో మాసీవ్ మూవ్ మెంట్”అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

Exit mobile version