NTV Telugu Site icon

SSMB 30: రాజమౌళి తర్వాత డైరెక్టర్ ఫిక్స్?

Mahesh Babu Special Training

Mahesh Babu Special Training

SSMB 29 అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. రాజమౌళి మాత్రం ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. లేటెస్ట్‌గా జరిగిన యానిమల్ ఈవెంట్‌లో కనీసం ఎస్ఎస్ఎంబీ 29 ఊసే ఎత్తలేదు కానీ మహేష్, రాజమౌళి ఇద్దరు ఒకే స్టేజీ మీద కనబడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

సందీప్ రెడ్డి కోసం ఇద్దరు ఈవెంట్‌కి వచ్చి యానిమల్ హైప్‌ని మరింత పెంచారు. అయితే ఈ ముగ్గురు కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే… రాజమౌళి తర్వాత మహేష్‌ను డైరెక్ట్ చేసేదెవరు? అనేది చాలా రోజులుగా చర్చ జరుగుతునే ఉంది. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి, కొరటాల శివ, సుకుమార్ పేర్లు లైన్లో ఉన్నాయి కానీ మహేష్‌ బాబు ‘యానిమల్’ ఈవెంట్‌కు రావడంతో ఎస్ఎస్ఎంబి 30 డైరెక్టర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. రాజమౌళి తర్వాత సందీప్ రెడ్డి వంగతో మహేష్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యానిమల్ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేయనున్నాడు సందీప్. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ కూడా అదే సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబో ఖాయమని చెప్పొచ్చు. అయితే ఈ లెక్క తేలాలంటే… ముందు రాజమౌళి సినిమాతో పాటు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాలి… రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఎస్ఎస్ఎంబి 30 గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Show comments