2024 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ప్రొడ్యూసర్ నాగ వంశీ “గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజులో ఉంటాయ”ని చెప్పాడు. దీంతో ఘట్టమనేని అభిమానులు 2024 సంక్రాంతికి మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి రేస్ లో గుంటూరు కారం సినిమాతో పాటు కల్కి, హను మాన్, ఈగల్, VD 13, నా సామీ రంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలకి థియేటర్స్ ఎక్కడ నుంచి వస్తాయి అనుకుంటూ ఉంటే లేటెస్ట్ గా సూపర్ స్టార్ కి పోటీగా సూపర్ స్టార్ దిగాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగాడు.
జైలర్ సినిమాతో కెరీర్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్… కోలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రజినీకాంత్… 2024 సంక్రాంతికి మళ్లీ ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. లాల్ సలామ్ సినిమాతో రజినీకాంత్ సంక్రాంతి రేస్ లోకి వచ్చాడు. లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ ప్లే చేసింది గెస్ట్ అప్పీరెన్స్ అయినా ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మాత్రం రజినీకాంత్ మాత్రమే. రజినీకాంత్ పేరు మీదనే, ఆయన ఇమేజ్ మీదనే లాల్ సలామ్ సినిమా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంది. లాల్ సలామ్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది కాబట్టి తెలుగులో కూడా మంచి నంబర్ ఆఫ్ థియేటర్స్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకట్లేదు అంటే ఇప్పుడు రజినీకాంత్ కూడా వచ్చి మరింత ఇబ్బందుల్లో పెట్టాడు.
LAL SALAAM to hit 🏏 screens on PONGAL 2024 🌾☀️✨
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️🎞️ @BPravinBaaskar
👕 @NjSatz
🎙️ @RIAZtheboss @V4umedia_
🎨🖼️ @kabilanchelliah
🤝 @gkmtamilkumaran… pic.twitter.com/4XOg3sozSs— Lyca Productions (@LycaProductions) October 1, 2023