NTV Telugu Site icon

Mahesh Pawan: ఈ కాంబినేషన్ గురించి జక్కన 12 ఏళ్ల క్రితమే చెప్పాడు

Mahesh Pawan

Mahesh Pawan

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్తీ రైవల్రీ అంటే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఫాన్స్ మధ్యే చూడాలి. ఒక హీరో బాక్సాఫీస్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేయడం… ఒక హీరో డిజిటల్ రికార్డులని ఇంకో హీరో బ్రేక్ చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేయడం మహేష్-పవన్ మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరోల గురించి ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది. ప్రస్తుతం టయర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేవలం రీజనల్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేయడం మహేష్ అండ్ పవన్ స్టైల్. రైవల్రీనే కాదు పవన్ మహేష్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఒకరికి అవసరం అయినప్పుడు ఇంకొకరు అండగా నిలుస్తూ ఉంటారు, పైగా ఇద్దరికీ త్రివిక్రమ్ కామన్ ఫ్రెండ్ కూడా. ఈ ఇద్దరు హీరోల మ్యూచువల్, మహేష్-పవన్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా పడితే చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జల్సా సినిమాకి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించిన త్రివిక్రమ్, ఈ స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా చేస్తాడేమో అనే ఆశతో మ్యూచువల్ ఫాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ కాంబినేషన్ సెట్ చేయడం అంత ఈజీ కాదు.

కలలో కూడా ఊహించడం కష్టమైన ఈ కాంబినేషన్ గురించి పదమూడేళ్ల క్రితమే జక్కన్న ఒక మాట అన్నాడు. 2010 జులై 12న రాజమౌళి ట్విట్టర్ లో “మహేష్ అండ్ పవన్ కాంబినేషన్ లో సినిమా అనేది ఒక కల లాంటిది… ఆ కాంబినేషన్ కోరుకోవడం టూ మచ్” అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేసాడు. 2010 నాటి జక్కన్న వేరు, ఇప్పుడు ఉన్న జక్కన్న వేరు కాబట్టి పవన్- మహేష్ ల కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఆలోచించినా కూడా అలాంటి కథ దొరకాలి. ఇద్దరు హీరోలని బాలన్స్ చెయ్యలేకపోతే థియేటర్స్ తగలబడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పవన్-మహేష్ లకి ఇప్పుడున్న క్రేజ్ అండ్ ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టుకోని చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమా అనేది ఇంపాజిబుల్. మరి జక్కన్న, సుకుమార్, త్రివిక్రమ్ లలో ఏ డైరెక్టర్ ఈ రిస్కీ డేర్ ని చేస్తారో చూడాలి. ఒకవేళ వీళ్లని ఒప్పించి సినిమా చేయగలిగితే మాత్రం అది తెలుగు సినిమా చూసిన బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది డికేడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show comments