Site icon NTV Telugu

Mahesh NTR: ఒక్కరోజు గ్యాప్‌లో డిజిటల్ రికార్డ్స్ బద్దలు!

Mahesh Ntr

Mahesh Ntr

ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి వరకు బయటికి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌ని ఓ రేంజ్‌లో ట్రెండ్ చేశారు. అలాంటప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు… అది కూడా ఈవెంట్ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జనవరి 6న సోషల్ మీడియాలో మహేష్ బాబు నామ స్మరణ జరగడం పక్కా. అలాగే ట్రైలర్‌తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే… మహేష్‌ ఫ్యాన్స్‌ కంటే డబుల్ జోష్‌లో ఉన్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.

గుంటూరు కారం ట్రైరల్ రిలీజ్ అయిన తర్వాత… ఒక్క రోజు గ్యాప్‌లో జనవరి 8న మోస్ట్ అవైటేడ్ దేవర గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ. గుంటూరు కారం కంటెంట్‌ పై కాస్త అయిన క్లారిటీ ఉంది కానీ… దేవర నుంచి వస్తున్న ఫస్ట్ గ్లింప్స్ ఇదే. దీంతో దేవర వరల్డ్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ అందిరలోను ఉంది. అందుకే… దేవరను టాప్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దేవర గ్లింప్స్ బయటికి రావడమే లేట్… డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు చేస్తామని టైగర్ ఫ్యాన్స్ కాచుకొని కూర్చుకున్నారు. ఇదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ… ఘట్టమనేని ఫ్యాన్స్ జనవరి 12 కోసం వెయిట్ చేస్తుండగా… నందమూరి అభిమానులు ఏప్రిల్ 5 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా… జనవరి 6, 8 తేదీల్లో మాత్రం మహేష్, ఎన్టీఆర్ దెబ్బకు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం గ్యారెంటీ.

Exit mobile version