Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్?

  • మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వారణాసి
  • ప్రియాంక చోప్రా వారణాసి లుక్‌ రిలీజ్‌
  • మహేశ్ బాబు బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్?
Mahesh Babu Birthday

Mahesh Babu Birthday

Mahesh Babu Fans expecting Varanasi Glimpse on August 9: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ పాన్ వరల్డ్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్‌లోని ఫొటోలను రిలీజ్ చేశారు. ‘ఆమె నవ్వితే అందం. నవ్వకపోతే నిప్పు కణిక’ అని డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రియాంక చోప్రా ఫొటోస్ రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర ప్రచారం మొదలైంది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న వారణాసి తొలి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు అభిమానులు, ఫ్యాన్ పేజీలు పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ హల్‌చల్ చేస్తున్నాయి. ‘బాబు బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్’, ‘బాబు బర్త్‌డేకు గ్లింప్స్ లోడింగ్’. ‘ఆగస్టు 9న ఇంతకుముందెన్నడూ చూడని హైప్ చూడబోతున్నారు’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో #Varanasi, #MaheshBabu హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ప్రియాంక చోప్రా బర్త్‌డే నాడు ఓ అప్డేట్ ఇచ్చారంటే.. పక్కాగా ఆగస్టు 9న భారీ సర్‌ప్రైజ్ ఉండనుంది. నిజంగానే గ్లింప్స్‌ రిలీజ్ అయితే.. మహేశ్ బాబు అభిమానులకు భారీ బర్త్‌డే కానుకగా నిలవనుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రం పాన్‌ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి షూటింగ్ పూర్తి చేసి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ డబుల్ రోల్ చేస్తున్నారు.