టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం “సర్కారు వారి పాట”తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘పెన్నీ’ పాటలో సితార తన తండ్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె వేసిన స్టెప్పులు, సితార ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ పాటలో సితార అద్భుతంగా కన్పించింది.
Read Also : Dhanush : కొడుకులతో కలిసి ఫస్ట్ టైం పబ్లిక్ గా… పిక్స్ వైరల్
అయితే తన ఎంట్రీ గురించి, ఈ సాంగ్ గురించి సితార ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సితార ఈ సాంగ్ ను షేర్ చేస్తూ “#Penny కోసం #SarkaruVaariPaata వంటి అద్భుతమైన టీమ్‌తో కలిసి పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది!! నాన్నా నేను నిన్ను గర్విపడేలా చేస్తాను !” అంటూ రాసుకొచ్చింది. ఇక సితార ఘట్టమనేని ఇన్‌స్టాగ్రామ్ ను చూస్తే ఆమెకు డ్యాన్స్ పై ఉన్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది. ‘పెన్నీ’ పాట కోసం ఆమెకు డ్యాన్స్ లో యాని మాస్టర్ శిక్షణను ఇచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన “సర్కారు వారి పాట”ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
