SSMB 28: పాన్ ఇండియా సినిమాకి పునాది పడింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ జనవరి 18న షూటింగ్ మొదలు పెడుతున్నాం అంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో SSMB 28 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చెయ్యనున్న భారి ఫైట్ తో ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యింది. దాదాపు 12 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ సినిమాని కూడా త్రివిక్రమ్ ఇలానే సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ లోనే వచ్చే ఆ ఫైట్ సీన్ ని థియేటర్స్ చూసి త్రివిక్రమ్ లో ఇంత మాస్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి అనేలా SSMB 28 యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసారట.
తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. SSMB 28 టైటిల్ ఇంకా పెట్టలేదు కానీ ఈ మూవీని ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే కన్ఫాం చేశాడు నాగ వంశీ అంటే అయిదు నెలల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండు నెలల పాటు ప్రమోషన్స్ చెయ్యాల్సి ఉంటుంది. సో దాదాపు మే నుంచి SSMB 28 అప్డేట్స్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. మహేశ్-త్రివిక్రమ్ లు కలిసి ఒక పాన్ ఇండియా సినిమాని మొదలు పెట్టిన ఎనిమిది నెలల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే మాములు విషయం కాదు. జనరల్ గా మహేశ్-త్రివిక్రమ్ లు స్లోగా షూటింగ్ చేస్తారు, ఈసారి ఆ మాటని చెరిపేసి చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేస్తారేమో చూడాలి.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!