Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Theatrical Business: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్‌వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290 కోట్లకు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డీల్ కుదర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో వారణాసి అగ్రస్థానంలో నిలవనుంది. ఇప్పటివరకు ఈ జాబితాలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ రూ.225 కోట్ల బిజినెస్‌తో ముందుంది. ‘పుష్ప 2’ రూ.200-220 కోట్లతో తర్వాతి స్థానంలో ఉండగా.. ‘కల్కి 2898 ఏడీ’ రూ.168 కోట్లు, ‘సలార్’ రూ.160 కోట్లు, ‘బాహుబలి 2’ రూ.122 కోట్లు, ‘దేవర’ రూ.120 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రూ.290 కోట్ల ధరకు వారణాసి తెలుగు హక్కులు అమ్ముడైతే.. ఆర్ఆర్ఆర్ రికార్డును రూ.65 కోట్ల తేడాతో అధిగమించినట్లవుతుంది.
Also Read
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
- Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
అయితే ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు లాభాలు అందుకోవాలంటే.. వారణాసి బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమవుతాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సాధించిన రూ.430 కోట్ల గ్రాస్ వసూళ్ల రికార్డు కూడా వారణాసి ముందు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ రికార్డును అధిగమించాలంటే మరో రూ.70 కోట్ల మేర అదనపు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్, రాజమౌళి దర్శకత్వం, మహేష్ బాబు స్టార్డమ్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న కథాంశం కాబట్టి.. వారణాసి ఈజీగా టార్గెట్ రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
తాజావార్తలు
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?