Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!

Mahesh Babu, Ss Rajamouli, Varanasi Movie

Mahesh Babu, Ss Rajamouli, Varanasi Movie

Varanasi: గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పలు రకాల డిఫరెంట్ షేడ్స్, వైవిధ్యమైన గెటప్‌లలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే ఒక గ్లోబల్ స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్ని షేడ్స్‌లో కనిపించినప్పటికీ.. ‘శ్రీరామచంద్రుని’ అవతారంలో వచ్చే దృశ్యాలు మాత్రం థియేటర్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని, అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అయితే తాజాగా ఈ గెటప్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. వారణాసి షూటింగ్ సెట్స్ నుంచి మహేష్ బాబు రాముడి గెటప్‌లో ఉన్న ఫోటో అంటూ నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో చాలామంది ఫ్యాన్స్ ఇది నిజంగానే సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన ఒరిజినల్ పిక్ అని నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఈ వైరల్ పిక్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే.. అది సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన అధికారిక ఫోటో కాదట. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో క్రియేట్ చేసిన ఫ్యాన్ మేడ్ ఫోటో. ఆ చిత్రాన్ని నిశితంగా గమనిస్తే అది ఏఐ జనరేటెడ్ పిక్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి, లీక్‌ల విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్, లీక్స్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ రాముడి గెటప్ ఫోటో మాత్రం వంద శాతం ఫేక్ అని తేలిపోయింది.