సినీ స్టార్స్ కు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తారో… ఫ్యామిలీకి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో టాప్ సెలెబ్రిటీ అయినా కూడా డేట్స్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారు ? అనే సందేహం చాలామందికి కలగక మానదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తరచుగా మహేష్ ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసిన ఫోటోలు, వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. మహేష్ ఫ్యామిలీతో కలిసి దాదాపుగా ఏడాదికి మూడుసార్లైనా వెకేషన్ కు వెళ్తుంటారు. ఏడాదికి మూడు వెకేషన్స్… ఎలా మహేష్ ? అని తోటి సెలెబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తారు. ఇప్పుడు అదే ప్రశ్నను ఎన్టీఆర్ మహేష్ ను అడిగారు.
Read Also : పిక్స్ : మరదలి పెళ్ళిలో రామ్ చరణ్… యాని మాస్టర్ కు ప్రత్యేక బాధ్యత
నిన్న ప్రసారమైన ఎన్టీఆర్ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఎన్టీఆర్, మహేష్ ని ఈ ప్రశ్న అడిగారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇద్దరూ సెలవులను ఎంజాయ్ చేయడం గురించి చర్చించుకున్నారు. కోవిడ్-19 భయాందోళనల మధ్య మహేష్ విహారయాత్రకు ఎలా వెళ్తాడోనని ఆందోళన చెందుతున్నానని ఎన్టీఆర్ జోక్ పేల్చారు. తన పిల్లలతో పాటు ఏడాదికి మూడు వెకేషన్స్ ప్లాన్ చేస్తానని మహేష్ వివరించాడు. “ఈ పర్యటనలు మా, మా పిల్లల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి” అని అన్నారు. ఊటీ తన ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అని మహేష్ చెప్పుకొచ్చారు.