Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణ అందం, అభినయం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీ రాకుమారుడుగా ఏలేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 సినిమా చేస్తున్న మహేష్ ఈ మధ్యనే గ్యాప్ తీసుకొని కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్ళాడు. ఇక వాణిజ్య ప్రకటనలు చేయడంలో మహేష్ ను కొట్టేవారే లేరు. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ అందం గురించి వర్ణించాలంటే.. పేరాలు.. పేరాలు రాసుకుపోవాల్సిందే. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందం డబుల్ అవుతుందా..? అన్నట్టే ఉంటుంది. మహేష్ కొడుకు గౌతమ్ పక్కన నిలబడితే అన్నదమ్ములా ఉంటారు.
Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..
మహేష్ ను చూసిన ప్రతి ఒక్క అమ్మాయి నమ్రత అదృష్టాన్ని పొగడకుండా ఉండలేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి అందం మహేష్ సొంతం. అసలు ఎలా అన్నా ఇలా మెయింటైన్ చేస్తున్నావ్ అంటే.. చిత్తశుద్ధి అని చెప్తాడు మహేష్. జిమ్, డైట్ అస్సలు మానడు. మహేష్ లా ఎవరైనా తినగలరా.. అంటే చచ్చిపోతాం అంటారేమో అలా ఉంటుంది అంట మహేష్ డైట్. ఇక తాజాగా ఒట్టో బ్రాండ్ షర్ట్స్ కోసం జరిగిన ఫోటోషూట్ లో మహేష్ పాల్గొనగా ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒట్టో షర్ట్స్ లో మహేష్ అందం.. వర్ణనాతీతం. ఈయనను చూస్తే .. 30 ఏళ్ళ క్రితమే ఏజ్ పెరగడం ఆగిపోయిందా..? అని అనిపించకమానదు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎంతో కూల్ గా కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. అన్నా నువ్వు అమృతమేమైనా తాగుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
