Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mission Teaser: కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్.. ఇప్పుడిప్పుడే తెలుగువారికి కూడా చేరువ అవుతున్నాడు. సాహో చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యిన అరుణ్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’. ‘ఫియర్‌లెస్ జర్నీ’ ట్యాగ్ లైన్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ సరసన ‘ఐ’ బ్యూటీ అమీ జాక్సన్ నటిస్తోంది. ఇప్పటికేఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Rajashekar: జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి.. మా అమ్మానాన్నల ముందు..
Also Read
లండన్‌లో పేరు మోసిన జైలు వాండ్స్ వర్త్. ఈ సినిమా మొత్తం ఈ జైలు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని అర్థమవుతుంది. ప్రపంచంలోని ఖైదీలందరూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంరక్షించే ఆఫీసర్ పాత్రలో అమీ జాక్సన్ నటిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్రలో హీరో అరుణ్ విజయ్ నటించారు. కుటుంబంతో ఇండియా నుంచి లండన్ వచ్చిన అరుణ్ విజయ్‌ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన కుమార్తెకు మరో రెండు రోజుల్లో ఆపరేషన్ ఉంటుంది. తనేమో జైలులో ఉంటాడు. తన కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అసలేం జరిగింది..హీరో అరుణ్ విజయ్ ఏ కారణాలతో తను వాండ్స్‌వర్త్ జైలుకి వెళ్లాడు. చివరకు వాండ్స్ వర్త్ జైలు సూపరిడెంట్ ఆఫీసర్ అయిన అమీ జాక్సన్ ఏమైనా హెల్ప్ చేసిందా?.. అసలు ఏ ‘మిషన్’ కోసంహీరో జైలుకు వెళ్లాడు అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అద్బుతమైన సన్నివేశాలు, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో ‘మిషన్: చాప్టర్ 1’ టీజర్ సూపర్బ్‌గా ఉంది. జి.వి.ప్రకాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందనటంలో డౌటేలేదని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్ తోనే ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!