Mahesh Babu is taking a break again from Guntur Kaaram: అతడు, మహేష్ ఖలేజా లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఏదో ఒక కారణంతో సినిమా షూటింగ్ అయితే వాయిదా పడుతూనే వచ్చింది. ముందుగా మహేష్ తల్లి మరణించడం తర్వాత ఆయన తండ్రి మరణించడం, స్క్రిప్ట్ లో మార్పులు, హీరోయిన్ల డేట్లు సర్దుబాటు అంశం, ఆ తర్వాత పూజా హెగ్డేని తప్పించడం, ఇలా ఏదో ఒక కారణం చేత సినిమా షూటింగ్ అయితే వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు షూట్ పరుగులు పెడుతుంది అని అనుకుంటున్న తరుణంలో తాజాగా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో చేయాల్సిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేశారని, అయితే తన కుమార్తె సితార పుట్టినరోజు జూలై 20వ తేదీన ఉండడంతో కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ఆయన దుబాయ్ పయనం అయినట్టు తెలుస్తోంది.
Priya Prakash Varrier: ఆ వీడియో తర్వాత తప్పుడు నిర్ణయాలు.. ప్రియా ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
అయితే సినిమా షూటింగ్ నుంచి మహేష్ దూరం అవుతున్నా సరే షూటింగ్ కి విరామం ఇవ్వకుండా త్రివిక్రమ్ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో లేని సీన్స్ షూటింగ్ అయిన పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన మహేష్ అభిమానులు మాత్రం అన్నా..వెకేషన్లో సినిమా చేస్తున్నావా?.. సినిమా మధ్యలో వెకేషన్ తీసుకుంటున్నావా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం కుమార్తె పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవద్దా? అంటూ ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇక ఈ సినిమాలో ముందుగా పూజ హెగ్డే, శ్రీ లీల ఇద్దరినీ హీరోయిన్లుగా అనుకున్నారు కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీ లీలలు మెయిన్ హీరోయిన్ గా చేసి ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా తాజాగా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి చౌదరి స్వయంగా వెల్లడించింది.