సంక్రాంతి పండగని కాస్త ముందుగానే మొదలుపెడుతూ జనవరి 12న రిలీజ్ కానుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎంత హైప్ అయినా క్రియేట్ చేసుకోండి మహేష్ అసలైన మాస్ ని చూపిస్తాం అంటూ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ ని పోస్టర్స్ తోనే ముందుకి లాగిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకటి కాదు రెండు కాదు రోజుకి రెండు మూడు పోస్టర్స్ వదిలి ఘట్టమనేని అభిమానులని ఖుషి చేస్తున్నారు గుంటూరు కారం సినిమా మేకర్స్. ఇప్పటివరకూ మహేష్ బాబు ఫైట్ చేస్తున్న పోస్టర్, లుంగీ కట్టుకున్న పోస్టర్, శ్రీలీలతో ఉన్న పోస్టర్, బీడీ తాగుతున్న పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు కానీ మొదటిసారి లేటెస్ట్ గా బయటకి వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.
మహేష్ బాబు బాడీ మొత్తంలో మోస్ట్ డెంజరస్ పార్ట్ ఆయన కళ్లు. ఇంటెన్సిటీని ఒక్క డైలాగ్ చెప్పకుండానే కేవలం కళ్లతో ప్రెజెంట్ చేయడంలో మహేష్ బాబు దిట్ట. అందుకే ఆయన కళ్ల గురించి అతడు సినిమాలో… వాడి కళ్లు ఎప్పుడూ పులి కళ్లలా ఉంటాయనే డైలాగ్ రాసాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని నిజం చేస్తూ గుంటూరు కారం సినిమా నుంచి ఒక పోస్టర్ బయటకి వచ్చింది. మహేష్ బాబు లుంగీ ఎగట్టి, సీరియస్ గా ఎవరినో చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే ఫ్యాన్స్ కి జనవరి 12న ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. మరి ఈ పోస్టర్ లోని సీన్ లో మహేష్ ఎవరికీ వార్నింగ్ ఇస్తున్నాడు? ఎవరిని కళ్లతోనే భయపెడుతున్నాడు అనేది చూడాలి.