Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికా అడవుల్లో జరుగుతోంది. కానీ ఆ విషయాలు బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ 19వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే విషెస్ చెబుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. 19వ పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్ కు నా అభినందనలు. నువ్వు ఇలాగే మరింత పైకి ఎదగాలని.. షైనింగ్ అవుతూ ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
Read Also : Anushka : అనుష్క వాళ్లకు భయపడి బయటకు రావట్లేదా..?
నా ప్రేమ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఫస్ట్ టైం నీ బర్త్ డే కు నేను దూరంగా ఉంటున్నాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ నా ప్రేమ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని రాసుకొచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి ఆఫ్రికా అడవుల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రా మీద కీలక సీన్లు తీస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న ప్రియాంక చోప్రా ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు అప్డేట్ చేయడంతో అసలు మ్యాటర్ లీక్ అయింది. నవంబర్ లో ఈ మూవీ నుంచి భారీ అప్డేట్ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. ఆ అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
