Site icon NTV Telugu

Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..

Mahesh

Mahesh

Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. మహేశ్ బాబు వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాడంటూ ప్రశంసిస్తున్నారు.

Read Also : Bigg Boss 9 : దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి పెరుగుతున్న క్రేజ్..

చాలా హాస్పిటల్స్ తో మహేశ్ బాబు ఫౌండేషన్ లింకప్ అయింది. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ సదరు హాస్పిటల్స్ కు మహేశ్ బాబు ఫౌండేషన్ బిల్లులు కడుతోంది. నిరుపేద కుటుంబాల తమ పిల్లలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. వారికి మహేశ్ బాబు అండగా ఉంటున్నాడు. ఈ సాయం ఇలాగే కొనసాగుతుందని గతంలోనే మహేశ్ బాబు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ రాజమౌళతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నారు మూవీ టీమ్. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. నవంబర్ లో ఈ సినిమా నుంచి భారీ అప్డేట్ రాబోతోంది.

Read Also : Baahubali Epic : రీ రిలీజ్ లోనూ టాప్ హీరోలకు బాహుబలి చెక్.. ఏంట్రా ఈ క్రేజ్..

Exit mobile version