Site icon NTV Telugu

Manchu Lakshmi : మంచు లక్ష్మీపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్..

Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ ఆమె చేసిన కామెంట్లు ఎన్నో.. ఆమెను వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో 12 ఏళ్ల కూతురును పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై లక్ష్మీ స్పందిస్తూ.. ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడిగే ధైర్యం ఉందా. 50 ఏళ్ల వయసులో మహేశ్ బాబు చొక్కా విప్పుకుని తిరిగితే తప్పు కాదా.. ఆడవారినే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు అంటూ ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

Read Also : OG : భారీ ట్విస్ట్.. ఓజీ సినిమాలో ప్రకాశ్ రాజ్..

ఇంకేముంది మహేశ్ బాబు ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. నీ గురించి నువ్వు చూసుకోకుండా మధ్యలో మహేశ్ బాబును ఎందుకు లాగుతావమ్మా అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. మహేశ్ బాబును టార్గెట్ చేస్తావా అంటూ సీరియస్ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే రచ్చ జరుగుతోంది. మంచు లక్ష్మీ మహేశ్ బాబును కావాలని అనలేదు. ఏదో ఫ్లోలో ఉదాహరణగా మహేశ్ బాబు టాపిక్ తీసుకుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం మా హీరోనే అంటావా అన్నట్టు రెచ్చిపోతున్నారు. మంచు లక్ష్మీ నటించిన దక్ష మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. దానికి ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నారు. మనోజ్ కూడా వచ్చి తనదైన స్టైల్ లో ప్రమోషన్ చేస్తున్నాడు.

Read Also : Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే

Exit mobile version