Site icon NTV Telugu

Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu : మహేశ్ బాబు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 ఏళ్లు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నేడు మహేశ్ బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హీరోలకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కామన్. కానీ అన్ని రకాల ప్లాట్ ఫామ్ లలో ఫాలోయింగ్ ను బేరీజు వేయాల్సి ఉంటుంది. ఇలా బేరీజు వేసినప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లలో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక సౌత్ హీరోగా మహేశ్ బాబు రికార్డు సృష్టించారు.

Read Also : War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

ట్విట్టర్ లో 13.8 మిలియన్ ఫాలోవర్లు ఆయనకు ఉన్నారు. అలాగే ఇన్ స్టా గ్రామ్ లో 14.6 మిలియన్ ఫాలోవర్లు, ఫేస్ బుక్ లో 14 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇలా అన్నింటిలో కోటి మంది సౌత్ లో ఏ హీరోకు కూడా లేరు. ఈ భిన్నమైన రికార్డు కేవలం మహేశ్ కు మాత్రమే సొంతం. ప్రస్తుతం రాజమౌళితో తన 29వ సినిమా చేస్తున్నాడు. అది భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా వస్తోంది. ప్రపంచ యాత్రికుడిగా ఇందులో కనిపించబోతున్నాడు మహేశ్. ఈ రోజు ప్రీ లుక్ ను రాజమౌళి రిలీజ్ చేశారు. నవంబర్ లో కంప్లీట్ లుక్ ను రివీల్ చేస్తామన్నారు రాజమౌళి.

Read Also : Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?

Exit mobile version