Site icon NTV Telugu

Agent Movie: అఖిల్ ‘ఏజెంట్’ మూవీ టీజర్‌పై మహేష్‌బాబు ప్రశంసలు

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu Appreciates Agent Movie Teaser: గత ఏడాది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో హాలీవుడ్ లెవల్ స్టంట్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమాకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. విజువల్స్, మూవీ థీమ్ అదిరిపోయాయని ట్విటర్ వేదికగా మహేష్‌బాబు కొనియాడాడు. అఖిల్, మమ్ముట్టి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర, ఇతర చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Mahesh Babu Latest Tweet:

కాగా మహేష్‌ ట్వీట్‌పై అఖిల్ కూడా స్పందించాడు. ఈ మేరకు ‘థాంక్యూ బ్రద‌ర్‌, మీ స‌పోర్ట్‌, ప్రోత్సాహం చాలా విలువైన‌ది’ అంటూ రీట్వీట్ చేశాడు. ఏజెంట్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే మిలియ‌న్స్ వ్యూస్‌ను సాధించింది. టాలీవుడ్‌లో టైర్‌2 హీరోల‌లో అత్యధిక లైక్స్ వచ్చిన టీజ‌ర్‌గా ఏజెంట్ నిలిచింది. మ‌ల‌య‌ళ స్టార్ మమ్ముట్టి కీల‌క‌పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.

Read Also: Kriti Sanon: వామ్మో.. ఆ బ్లాక్ గౌను ఖ‌రీదు అన్ని లక్షలా?

Exit mobile version