NTV Telugu Site icon

Mahesh Babu : దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ ఇదా?

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, “సర్కారు వారి పాట” మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించగా, సినిమాను వెండితెరపై వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా, తాజాగా మహేష్ బాబు దుబాయ్ ట్రిప్, దాని వెనుక ఉన్న రీజన్ ఇదేనంటూ ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also : Ram Charan : మెగా గుడ్ న్యూస్… బాబాయ్ తో సినిమా కన్ఫర్మ్

ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో దుబాయ్ లో ఫ్యామిలీతో చిన్న సమ్మర్ వెకేషన్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఈరోజు ఉదయాన్నే దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసిందట. కానీ ఈ దుబాయ్ ట్రిప్ వెనుక అసలు ప్లాన్ వేరే ఉందంటున్నారు. త్వరలో దర్శక దిగ్గజం రాజమౌళి కూడా దుబాయ్ వెళ్లనున్నారట. వీరిద్దరి కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ స్టోరీ గురించి మహేష్, రాజమౌళి సిట్టింగ్ ఉండబోతోందనే టాక్ జోరందుకుంది. యాక్షన్-అడ్వెంచర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు మేకర్స్.