ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కిట్టిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ షూటింగ్, నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ప్రస్తుతం షూటింజి దశలో ఉన్న ‘భోళా శంకర్’కు సంగీతం అందించడానికి ఈసారి చిరంజీవి మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్‌ను ఎంచుకున్నారు. నిన్న దసరా సందర్భంగా ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Also : టాప్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “భోళా శంకర్”ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి మళ్లీ మాస్ హీరోగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కలిసి నటించారు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ‘గాడ్ ఫాదర్’ ఇటీవల యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది.