Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharani Season 5: ఓటీటీ ప్రపంచంలో కొన్ని వెబ్ సిరీస్‌లు హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఒక ప్రత్యేక బ్రాండ్‌గా కూడా నిలుస్తాయి. అలాంటి సిరీస్‌లలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నది ‘మహారాణి’. ఈ పొలిటికల్ థ్రిల్లర్ గత ఐదేళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు, మొత్తం 36 ఎపిసోడ్లతో భారీ వ్యూస్ నమోదు చేసిన ఈ సిరీస్ ఇప్పుడు ఐదో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హుమా ఖురేషి స్వయంగా కొత్త సీజన్ షూటింగ్ గురించి ఆఫీషియల్ గా అనాన్స్ చేయడంతో ఈ సీజన్ కోసం మరో సారి ఈగర్ గా ఎదరుచూస్తున్నారు ప్రేక్షకులు. 2021లో ప్రారంభమైన ‘మహారాణి’ సిరీస్ పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కినప్పటికీ, ఇందులోని కథనం మాత్రం భిన్నంగా ఉంటుంది. బీహార్ రాజకీయాల స్ఫూర్తితో రూపొందించిన ఈ కథలో రాణి భారతి అనే మహిళ అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, ఆ తర్వాత అధికార పోరాటం, రాజకీయ కుట్రలు, వ్యక్తిగత సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ఈ పాత్రలో హుమా ఖురేషి నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కెరీర్లో అత్యంత గుర్తింపు తీసుకొచ్చిన పాత్రల్లో ఇది ఒకటిగా నిలిచింది.
ప్రతి సీజన్‌తో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతూ వచ్చింది. తొలి రెండు సీజన్లు 10 ఎపిసోడ్లతో విడుదల కాగా, మూడో, నాలుగో సీజన్లు చెరో 8 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటివరకు మొత్తం 36 ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ప్రతి సీజన్ ముగింపులో వచ్చే ట్విస్టులు తర్వాతి సీజన్ పై ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. అందుకే ‘మహారాణి’ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. కొద్ది రోజుల క్రితం హుమా ఖురేషి తన సోషల్ మీడియా ద్వారా ‘మహారాణి 5’ షూటింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించారు. దీంతో ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. అయితే కథ ఎలా ఉండబోతోంది, ఎప్పుడు విడుదల కానుంది వంటి వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, గత సీజన్ల విజయాన్ని బట్టి ఈసారి కూడా రాజకీయ వ్యూహాలు, అధికార పోరాటం, అనూహ్య మలుపులతో కథ మరింత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
- OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు...ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
- Suriya47: దీపావళి బరిలో 'సూర్య47'?.. హ్యాట్రిక్ రిలీజ్‌కు స్టార్ హీరో రెడీ!
- Dhanush : ధనుష్ నెక్ట్స్ లక్ష్యం రాజకీయాలేనా...? అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా..?
- Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
‘మహారాణి’ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ నిర్మించింది. అందువల్ల ఐదో సీజన్ కూడా అదే ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ కథనాలను ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చూపించడంలో ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా బీహార్ రాజకీయాల నేపథ్యాన్ని కల్పిత పాత్రలో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. లాలూ కుటుంబం చుట్టూ సాగే ఈ పాత్రల నేపథ్యం కూడా చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ‘మహారాణి’ ఇప్పటికే తప్పక చూడాల్సిన సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు ఐదో సీజన్ ప్రకటించడంతో మరోసారి ఈ సిరీస్ చర్చల్లోకి వచ్చింది. ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ విజయగాథలో కొత్త అధ్యాయం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే ‘మహారాణి 5’ విడుదల వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
-
Marriage Cheating Case: ఎంతకు తెగించార్రా.. అమ్మాయి అని చెప్పి ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి చేశారంటూ యువకుడు ఫిర్యాదు
-
Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
-
Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!