NTV Telugu Site icon

Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్

Keethy Suresh

Keethy Suresh

మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్‌లో గీరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్ పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్‌లో ఎక్స్ పోజింగ్‌కు నో చెప్పిన మహానటి నార్త్‌ బెల్ట్‌కు ఇలా వెళ్లిందో లేదో బేబీ జాన్‌తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చేయలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి. బేబీ జాన్ డిజాస్టర్ బాలీవుడ్ కెరీర్ డైలమాలో పడేట్లు చేసింది.

Also Read : Tollywood : ఆ సినిమా ఇన్ సైడ్ టాక్.. చాలా బాగా చెప్తున్నారు

ఇక బేబీ జాన్ కన్నా ముందే అక్కా అనే వెబ్ సిరీస్ చేసింది కీర్తి. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బోల్ట్ లుక్కులో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌లో దర్శనమిచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియెంట్ చిత్రాల్లో నటించింది కీర్తి  కానీ ఆ సినిమాలలతో పోల్చకుంటే ఈ సిరీస్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తోంది. సౌత్‌లో హోమ్లీ గర్ల్‌గా ముద్ర పడటం వల్లో ఏమో నార్త్ బెల్ట్‌లోకి వెళ్లగానే గ్లామర్, ఎక్స్ పోజింగ్ హీరోలతో ఓవర్ రొమాన్స్ చేసింది మేడమ్. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కింది కీర్తి. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో ఆంటోనీ థాటిల్ ను వివాహం చేసుకుని.. సెట్స్, షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ సారి బాలీవుడ్‪పై కాన్సట్రేషన్ పెడుతోంది. హిందీలో ఓ రామ్ కామ్ మూవీకి కమిటైనట్లు టాక్. ఇవే కాకుండా తమిళంలో రివాల్వర్ రీటా, కన్నివీడి చేస్తుంది. తెలుగులో భోళా శంకర్ తర్వాత కల్కికి బుజ్జికి వాయిస్ ఇచ్చింది తప్ప మరో కొత్త సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు.