NTV Telugu Site icon

బుల్లితెర భీముడి కన్నుమూత!

mahabharath

mahabharath

దేశ వ్యాప్తంగా బుల్లితెర వీక్షకులను అలరించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి (75) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ చోప్రా రూపొందించిన ‘మహాభారత్’ సీరియల్ ఆయనకు నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘తన తండ్రి సోమవారం రాత్రి 9.30 లకు ఢిల్లీలోని నివాసంలో గుండెపోటుతో మరణించార’ని ఆయన కుమార్తె నికుణిక తెలిపింది. కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా అమితాబ్ ‘షెహన్ షా’, ధర్మేంద్ర ‘లోహా’తో పాటు ‘ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్’ తదితర చిత్రాలలో ప్రవీణ్ కుమార్ సోబ్తీ కీలక పాత్రలు పోషించారు.

నటుడిగా మారక ముందు ప్రవీణ్ కుమార్ డిస్క్ త్రో క్రీడాకారుడిగా రాణించారు. నాలుగు సార్లు ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించారు. భారత్ తరఫున 1968, 1972లో ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొన్నారు. క్రీడాకారుడిగా అర్జున్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిప్యూటీ కమాండెంట్ గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేశారు.