కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మద్రాస్’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. దర్శకుడు పా. రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘మద్రాస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే ?
సెప్టెంబర్ లో ‘మద్రాస్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని, ఇతర వివరాలను వీలువెంబడి తెలియచేస్తామని అన్నారు. కార్తీ, కలైరసన్ హరికృష్ణన్, కేథరిన్ త్రేసా, రిత్విక ప్రధాన పాత్రలు పోషించిన ‘మద్రాస్’ చిత్రానికి భారతీబాబు రచన చేయగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చాడు.