మాలీవుడ్ మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ ఎంపురన్ రిలీజ్ కోసం నాట్ ఓన్లీ కేరళ ఇండస్ట్రీ యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. లూసీఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్‌పై ఎక్స్ పర్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మార్చి 27న వరల్డ్ వైడ్‌గా సినిమాను తీసుకు వస్తున్నారు మేకర్స్. హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంచైజీ మూవీని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమా నిర్మిస్తున్నాయి.
Also Read : Posani Case : రైల్వే కోడూరు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్
యాక్చువల్లీ టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ చేయోచ్చు కానీ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అనే కొత్త థాట్‌తో ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఎంపురన్‌లో కీ రోల్స్ ప్లే చేస్తున్న 36 మంది క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అన్ని క్యారెక్టర్లను పరిచయం చేశారు. మోహన్ లాల్, పృధ్వీ, టొవినో థామస్, మంజు వారియర్, సూరజ్, ఇంద్రజిత్, నిఖితా ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ మాత్రమే కాదు విదేశీ నటుల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎంపురన్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఓ అడుగు ముందుకేసింది యూనిట్. ఈ ఫ్రాంచైజీ మూవీలో హాలీవుడ్ యాక్టర్లు కనిపించబోతున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్ యాక్టర్ జేరోమ్ ఫ్లిన్ బోరిస్ ఓలివర్ అనే క్యారెక్టర్ లో మెరిశాడు. అలాగే బ్రిటీష్ యాక్ట్రెస్ ఆండ్రియా టివాదర్, ఫ్రెంచ్ యాక్టర్ ఎరిక్ ఎబౌనీలు కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇలా ఒక్కో క్యారెక్టర్‌కు ఒక్కో ఎలివేషన్ ఇచ్చి సినిమాను ఓ లెవల్లో లేపుతున్నారు. మరీ లూసిఫర్ సీక్వెల్ హై ఓల్డేజ్ ఎక్స్ పర్టేషన్స్ నిలబెట్టుకుందో లేదో చూడాలి.