MAD Director Comments at MAD Fest 23: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోన్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ మాది చిత్తూరు జిల్లా మంగళంపేట, ఆరు దాటితే బస్సు లేని ఊరు నుంచి వచ్చానని అన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు మీడియం, అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అన్నారు.
Dil Raju : దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం
కళ్యాణ్ గారి పేరు నా పేరులో పెట్టుకున్నా, త్రివిక్రమ్ పేరు నా గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయడం మొదలు పెట్టానని అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ ఇద్దరి స్ఫూర్తితో ఇక్కడి వరకు వచ్చానని పేర్కొన్న ఆయన ఆ తర్వాతి స్థానం అనుదీప్ ది అని అన్నారు. అనుదీప్ ని కలిసినప్పుడే ఇతను గొప్పవాడు అవుతాడు అనుకున్నా ఒకరకంగా మ్యాడ్ లాంటి సినిమా రావడానికి జాతిరత్నాలే పునాది అని అన్నారు. ఇక నాగవంశీ అన్నని కలవడం నా లైఫ్ లో గొప్ప ఛేంజ్ అని మ్యాడ్ కథ చినబాబు గారికి నచ్చడంతో నాతో పాటు దాదాపు 40 మంది లైఫ్ మారిపోయిందని అన్నారు. మ్యాడ్ టీం కోసం వెతుకుతుంటే సంగీత్, రామ్ నితిన్, నార్నే నితిన్ ఇలా ఒక్కొక్కరిగా ప్రాజెక్ట్ లోకి వచ్చారని, విష్ణు లేట్ గా ప్రాజెక్ట్ లోకి వచ్చినా హీరోల కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసి మా సినిమాకి హైప్ తీసుకొచ్చారని ఆయన హ్యాండ్ ఎంత మంచిదో మళ్ళీ రుజువైందని అన్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ట్వీట్ చేసి మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారని, విశ్వక్ సేన్ సినిమా చూసి బాగుందని ట్వీట్ చేశారని, రవితేజ ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఎనర్జీ ఇచ్చిందని అన్నారు.