Actor Manas: సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఒక పక్క సీరియల్, షోస్ చేస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ లో కూడా మానస్ పాల్గొని మంచి ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా మానస్.. ఒక ఇంటివాడు కానున్నాడు. తాజాగా నేడు మానస్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఒక వ్యాపారవేత్త కుమార్తె శ్రీజ నిశ్శంకర్ రావుతో అతని నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇప్పటివరకు మానస్ ఈ విషయాన్ని చెప్పలేదు.
RS Shivaji: బిగ్ బ్రేకింగ్.. సీనియర్ నటుడు శివాజీ కన్నుమూత
మానస్ తల్లి చాటు బిడ్డ అని బిగ్ బాస్ లోనేఅర్థమైంది. ఆమె ఏది చెప్తే అదే మానస్ చేస్తాడని అందరికి తెలిసిందే. ఇక శ్రీజను కూడా మే సెలక్ట్ చేసింది అని తెలుస్తోంది. శ్రీజ, మానస్ ల జంట ఎంతో అద్భుతంగా ఉంది. వైలెట్ కలర్ డ్రెస్ లో వధూవరులు నవ్వులు చిందిస్తూ మెడలో దండాలు మార్చుకున్నారు. ఇక ఈ నిశ్చితార్దానికి మానస్ స్నేహితులు.. సన్నీ, ఆర్జే కాజల్, కోయిలమ్మ హీరోయిన్ తేజస్విని.. తదితరులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. త్వరలోనే వీరి పెళ్లి ఉండనుంది. ఇక మానస్ ఎంగేజ్ మెంట్ ఫోటోలను చూసిన అభిమానులు వారికి కంగ్రాట్స్ చెప్తున్నారు.