NTV Telugu Site icon

Maamannan: నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో మామన్నన్.. మాములుగా లేదుగా

Mamannan

Mamannan

Maamannan: ఒక సినిమా థియేటర్ లో ఎంత బాగా ఆడింది అన్నదాని కన్నా.. అదే రికార్డును ఓటిటీలో కూడా కంటిన్యూ చేస్తుందా అనేది ముఖ్యం. కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడిన.. ఓటిటీలో తుస్సుమనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ టాక్ అందుకున్నా ఓటిటీలో మాత్రం హిట్ టాక్ ను అందుకుంటాయి. అందుకే ఓటిటీ టాక్ ను కూడా ఇప్పుడు ప్రేక్షకులు చెక్ చేస్తున్నారు. తాజాగా థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఒక సినిమా ఓటిటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఆ సినిమానే మామన్నన్. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మామన్నన్. తమిళ్ లో జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Rajinikanth: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే..

ఇక అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నాయకుడు పేరుతో రిలీజ్ చేశారు. అయితే తెలుగువారికి ఈ సినిమా అంతగా ఎక్కలేదు. తక్కువ కులం వారిని ఎక్కువ కులంవారు ఇంకా ఎంత చులకనగా చూస్తున్నారో మారి సెల్వరాజ్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇక ఈ సినిమా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ ఓటిటీలోకి అడుగుపెట్టింది. ఇక థియేటర్ కు వెళ్లి చూడని ప్రేక్షకులు.. ఈ సినిమాకు క్యూ కట్టారు. ఓటిటీలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమానే ఉండడం విశేషం. ఇక దీంతో నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ పోస్టర్ ను మారి సెల్వరాజ్ పోస్ట్ చేస్తూ “చిందిన ఆ రక్తపు చుక్కలు కూడా ఆనందిస్తాయి” అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments