Polimera 2: ‘మా ఊరి పొలిమేర -2`.. ఈసారి థియేటర్లో వణకాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Ma Oori Polimera-2’ to release on November 3 in grand scale: కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడి.. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పొలిమేర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పొలిమేరకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర 2” చిత్రీకరణ పూర్తి చేసుకుమొ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాను చూసి ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా వ్యవహరించారు.
Dil Raju: ప్రకాశ్ రాజ్ ని పట్టుకుని భోరున ఏడ్చేసిన దిల్ రాజు
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందుమౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని తెరకెక్కించామని, మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలను ఈ చిత్రంలో జోడించామని, ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. వాట్ నెక్ట్స్ అనేది ఎవరూ ఊహించలేరని అన్నారు. పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్ లో షూటింగ్ చేశామని పేర్కొన్న ఆయన సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారు. నవంబర్ 2న మా సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందన్నారు.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..