NTV Telugu Site icon

‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా ముందు ఆయన సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు.

Read also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు

సుకుమార్ సినిమాలన్నింటిలో ప్రత్యేకంగా ఆకర్షించే ఐటెమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక “పుష్ప”లో కూడా స‌మంత‌తో ఈ ఐటమ్ సాంగ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ పాట గురించి చంద్రబోస్ మాట్లాడుతూ ‘సంగీత స్వరకల్పన చరిత్రలో ఈ సాంగ్ ఓ రికార్డు’ అని వెల్లడించారు. “దేవిశ్రీ ప్రసాద్ 4 మ్యూజికల్ నోట్స్ తో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ సాంగ్ కంపోజ్ చేశాడు. చరిత్రలో ఎవరూ అలా చేయలేదు. ఇంతకుముందు ఇళయరాజా 3 మ్యూజికల్ నోట్స్‌తో ఓ పాటను కంపోజ్ చేయగా, ఇప్పుడు డీఎస్పీ 4 నోట్స్‌తో ‘ఊ అంటావా’ సాంగ్ ను క్రియేట్ చేశాడు” అని తెలియజేశారు చంద్రబోస్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సాంగ్ లిరిక్స్ పై వివాదం నడుస్తోంది.

Lyricist Chandrabose Superb Speech At Pushpa MASSive Pre Release Party | Allu Arjun | Rashmika | NTV