Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా వెలిగిన లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడంలో ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యానర్ ఇటీవల కాలంలో డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దర్శక ధీరుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. 2023 చివరిలో వచ్చిన చంద్రముఖి2 మొదలు పెడితే మిషన్ చాప్టర్ వన్, లాల్ సలామ్, వెట్టయాన్, ఇండియన్2, విదాముయర్చి చిత్రాలు భారీ డిజాస్టర్స్ చూశాయి.
ఇండియన్ 2 ఫలితం లైకా ప్రొడక్షన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 3’ని థియేటర్లలో విడుదల చేయాలా? లేక నేరుగా ఓటీటీకి ఇవ్వాలా? అనే సస్పెన్స్ నడుస్తోంది. దీనితో పాటు సంస్థ ప్లాన్ చేసిన కొన్ని ‘సిగ్మా మూవీస్’ కూడా బడ్జెట్ సర్దుబాటు కాక ముందుకు కదలలేక సంక్షోభంలో పడ్డాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లైకా ప్రొడక్షన్స్ ఆశలన్నీ మణిరత్నం సినిమాపైనే. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ మూవీ ఈ నెలలో షూటింగ్ మొదలు కాబోతుంది. అలాగే తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సిగ్మా జులై 31న రిలీజ్ కానుంది. మలయాళంలో తెరకెక్కుతున్న ‘పరిమళ అండ్ కో’ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా సంస్థను గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. వరుస పరాజయాల సుడిగుండంలో చిక్కుకున్న లైకా ప్రొడక్షన్స్‌ను ఈ రాబోయే సినిమాలు కాపాడుతాయా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..