Lust Stories 2 Trailer: నెట్ ఫ్లిక్స్ అంటే అడల్ట్ కంటెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెల్సిందే. తాజాగా అందులో మరో కొత్త అడల్ట్ కంటెంట్ యాడ్ అయ్యింది. అదే లస్ట్ స్టోరీస్ 2. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ,అమృత సుభాష్, అంగద్ బేడీ..లాంటి స్టార్ క్యాస్టింగ్ తో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తోంది నెట్ ఫ్లిక్స్. నాలుగు కథలు, నలుగురు దర్శకులు..అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నీనా గుప్తా, మృణాల్ కు బామ్మగా కనిపించగా.. కాజోల్ గృహిణిగా కనిపించింది. తమన్నా సింగిల్ విమెన్ గా కనిపించింది.
Pawan Kalyan: నా అభిమానులే నన్ను తిడుతున్నారు.. ఫ్యాన్స్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
ఇక ట్రైలర్ మొత్తాన్ని శృంగారం తో నింపేశారు. మృణాల్ ను పెళ్ళికి ముందే టెస్ట్ డ్రైవ్ మని చెప్పే బామ్మ.. పనిమనిషిపై మోజుపడ్డ కాజోల్ భర్త.. పెళ్లి అయిన వాడితో రొమాన్స్ కు సిద్దమైన తమన్నా.. తాను ఎంతో ఆరాధించే అక్క.. వేరొకరితో శృంగారం చేస్తూ చెల్లెలుకు దొరికిపోవడం.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. ప్రతి కథలో కూడా శృంగార వాంఛలు తీర్చుకోవడానికి ఆ మహిళలు ఏం చేశారు అనేది చూపించారు. ఇందులో నటించిన వారందరూ బాలీవుడ్ నటీమణులే కాబట్టి ఎవరికి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. కానీ, టాలీవుడ్ బ్యూటీ తమన్నా హద్దుమీరిన బోల్డ్ సీన్స్, అందాల ఆరబోతను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి ట్రైలర్ మొత్తం అడల్ట్ సీన్స్ తో నింపేశారు. ఇకపోతే ఈ సిరీస్ జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లస్ట్ స్టోరీస్ కన్నా లస్ట్ స్టోరీస్ 2 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
