శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” సినిమా ఓవర్శిస్ లో దుమ్ము దులుపుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి జత కట్టిన ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 24 న థియేటర్‌లలోకి వచ్చింది. అన్ని వర్గాల సినిమా ప్రియుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో 2 మిలియన్ వచ్చింది. ఇప్పుడు ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ కలెక్షన్స్ ను దాటి కరోనా మహమ్మారి తరువాత మంచి కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Read Also : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ఈ సినిమాపై విమర్శకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా నేపథ్య స్కోర్‌ని పవన్ స్వరపరిచారు. పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, దేవయాని, రావు రమేష్, ఈశ్వరి రావు, సత్యం రాజేష్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్ ‘లవ్ స్టోరీ’లో కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్, మార్తాండ్ కె వెంకటేష్ లవ్ స్టోరీకి ఎడిటర్.