Oscar Award: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆస్కార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆస్కార్ 2023 నామినేషన్స్ లో తెలుగు సినిమాలు ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. వాటిని పక్కకు నెడుతూ గుజరాతీ సినిమా చెల్లో షో నామినేట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో సోషల్ మీడియాలో ఆస్కార్ అవార్డుల గురించి చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి గతంలోకి వెళితే.. ఇప్పటివరకు ఆస్కార్ అవార్డులు అందుకున్నది కేవలం ఐదుగురే.. నామినేషన్స్ కు వెళ్ళినవి కేవలం మూడు సినిమాలు మాత్రమే.. అవేంటంటే.. మొట్టమొదటిసారి 1957 లో మదర్ ఇండియా అనే సినిమా ఆస్కార్ నామినేషన్స్ లోకి వెళ్ళింది కానీ గెలవలేదు.. ఇక ఈ సినిమా తరువాత 1988 లో సలాం బాంబే.. 2001 లో అమీర్ ఖాన్ నటించిన లగాన్ నామినేషన్ వరకు వెళ్లాయి కానీ అవార్డును గెలుచుకోలేకపోయాయి. ఇక ఆస్కార్ ను మొట్ట మొదటిసారి ఇండియాకు తీసుకొచ్చింది.. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతియా. 1982 లో గాంధీ అనే సినిమాకు బెస్ట్ క్యాస్టూమ్స్ ఇచ్చినందుకు ఆమె ఆస్కార్ అవార్డును అందుకుంది.
ఇక 1992 లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే కు.. ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించినందుకు గాను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కేటగిరిలో ఆస్కార్ వరించింది. ఇక 20ఓ.. దేశ చరిత్రలో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మూమెంట్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఆస్కార్లు ఇండియాకు దక్కాయి. ఒకే సినిమాతో దేశ గౌరవాన్ని నిలబెట్టారు.. సంగీత దర్శకుడు ఏఆర్ రెహామన్ అండ్ టీమ్. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో జయహో సాంగ్ కు గాను.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్లను అందుకున్నాడు. ఒక వేదికపై రెండు ఆస్కార్ లను అందుకున్న కళాకారుడుగా రెహమాన్ రికార్డు సృష్టించాడు. ఇక ఇదే పాటకు బెస్ట్ లిరిసిస్ట్ కేటగిరిలో గుల్జార్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరిలో రసూల్ పోకుట్టి ఆస్కార్ లను అందుకున్నారు. వీరి తరువాత ఇప్పటివరకు ఆస్కార్ విన్నర్ కాదు కదా నామినేషన్స్ లో కూడా ఏ ఇండియన్ సినిమా వెళ్ళలేదు. తాజాగా 2023 సంవత్సరానికి గాను చెల్లో షో నామినేట్ అయ్యింది. మరి ఈ సినిమా అవార్డును అందుకుంటుందో లేదో చూడాలి.