Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leonardo DiCaprio: హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ‘టైటానిక్’ సినిమా. 11 ఆస్కార్లు గెలిచి ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా వచ్చిన ‘One Battle After Another’ ఆరు ఆస్కార్లు గెలిచి సంచలనం సృష్టించింది. దీంతో ఈ మధ్య ఈ హీరో వార్తల్లో బాగా ఫేమ్ అయ్యారు. అయితే ఈసారి ఆయన మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఈ సారి కొత్త సినిమా వల్ల కాదు, వ్యక్తిగత జీవితం వల్ల కూడా కాదు. ఒక హోటల్ వెయిటర్ జీవితాన్ని మార్చిన ఉదారతతో ఆయన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఒక రెస్టారెంట్లో భోజనం ముగిసిన తర్వాత ఆయన వెయిటర్ కు ఇచ్చిన టిప్ మొత్తం ఎంతంటే, అది విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఆ డబ్బు అందుకున్న వెయిటర్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. అసలు లియోనార్డో ఎందుకు అంత పెద్ద మొత్తం టిప్ ఇచ్చారు? ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వైరల్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల ఫ్రాన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సెయింట్ ట్రోపెజ్‌లో లియోనార్డో డికాప్రియో తన స్నేహితులతో కలిసి ఓ విలాసవంతమైన రెస్టారెంట్లో విందుకు హాజరయ్యారు. సుమారు 15 మంది అతిథులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆయన సర్వీస్ అందించిన వెయిటర్‌కు 50 వేల యూరోలు టిప్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.55 లక్షలకు సమానం. సాధారణంగా రెస్టారెంట్లలో వందలలో మాత్రమే టిప్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఒక్కసారిగా ఇంత భారీ మొత్తాన్ని టిప్‌గా ఇవ్వడం అక్కడ ఉన్న వారినే కాదు, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఈ సంఘటన తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యంట్ వైరల్ అవుతోంది.
Also Read
- Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన 'కల్లు మామ' పాట
- Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
ఈ విషయాన్ని ఫ్రెంచ్ టెలివిజన్ వ్యాఖ్యాత బెంజమిన్ కాస్టాల్డి తన యూరప్ 2 మార్నింగ్ షో ‘కాస్టా రెవెయిల్ లా ఫ్రాన్స్’ లో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, లియోనార్డో తన బ్యాంక్ కార్డుతో ఆ మొత్తం చెల్లించారని తెలిపారు. టిప్ మొత్తం తెలిసిన వెంటనే ఆ వెయిటర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనతో లియోనార్డో డికాప్రియో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత భారీ టిప్ ఇదేననే ప్రచారం జరుగుతోంది. అంతకుముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా వెనిస్లో జరిగిన తన వివాహ వేడుకల అనంతరం సుమారు 52 వేల డాలర్ల టిప్ ఇచ్చిన విషయం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ స్థాయిలోనే లియోనార్డో చేసిన ఈ ఉదారత కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో లియోనార్డో డికాప్రియో ఒకరు. నివేదికల ప్రకారం ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 300 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,890 కోట్లకు పైగానే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో కూడా ఆయన అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారీ ఆస్తి కలిగి ఉండటమే కాదు, అవసరమైన సందర్భాల్లో ఉదారంగా వ్యవహరించే వ్యక్తిగా కూడా ఆయన మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు లియోనార్డో డికాప్రియోను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోట్లాది రూపాయల సంపద ఉన్నప్పటికీ సేవ చేసిన వ్యక్తి కష్టాన్ని గుర్తించి అతని జీవితాన్ని మార్చే స్థాయిలో టిప్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా తన పెద్ద మనసుతో లియోనార్డో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
- Tags
- cinema
- Leonardo DiCaprio
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?