Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నేడు బాద్ షాగా పేరు తెచ్చుకుని.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు షారూక్. నెక్ట్స్ ఈయన నట వారసులు ఇండస్ట్రీలోకి ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ అవుతానంటే.. తన సినిమాను కూడా ఆపుకుని అతడి కోసం వర్క్ చేశాడు షారూఖ్. బ్యాడ్సాఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సగం బాలీవుడ్ స్టార్స్‌ని తెచ్చాడు బాద్ షా.
కొడుకుని దర్శకుడిగా మార్చిన షారూఖ్ ఖాన్.. నెక్ట్స్ కూతుర్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను టేకప్ చేశాడు . ఇప్పటికే ది ఆర్చిస్ మూవీతో ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన సుహానా ఖాన్.. నెక్ట్స్ తన తండ్రి ఫిల్మ్ కింగ్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తీసుకోబోతోంది. అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు షారూఖ్. ఈ ఇయర్ ఎండింగ్లో కింగ్ రాబోతున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా కూతురు విస్మయను సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా ఫ్రూవ్ చేసుకోగా.. విస్మయను హీరోయిన్గా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు లాలట్టన్. తుడక్కం మూవీ ఎనౌన్స్మెంట్ నుండే ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుండగా.. లాలట్టన్ తన ఇమేజ్ మరింత అద్దబోతున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు మోహన్ లాల్. 2018 ఫేమ్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకుడు. ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తుడక్కమ్. కూతుళ్ల కోసం షారూఖ్, మోహన్ లాల్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Also Read
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన 'టైటానిక్' హీరో... కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
- Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
తాజావార్తలు
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!