Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallu Mama Song: కొన్ని పాటలు సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎక్కవగా లవ్ సాంగ్స్ ఆ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే బాలీవుడ్ కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్య’లోని ‘గోలీ మార్ భేజే మే’ పాట అలాంటి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇది లవ్ సాంగ్ మాత్రం కాదు. ఇందులో వినిపించే ‘కల్లు మామ’ అనే పదం అండర్వరల్డ్కు సంబంధించిన ఐకానిక్ రిఫరెన్స్‌గా గుర్తింపు పొందుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటకు ఏమాత్రం క్రేజ్ తగ్గకపోవడం విశేషం.
1998లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ విడుదలైనప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాల హవానే కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా భిన్నమైన స్టైల్ ను పరిచయం చేసింది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, రియలిస్టిక్ మేకింగ్, మాఫియా కథనం ఈ మూవీని సినీ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. మనోజ్ బాజ్‌పేయ్ పోషించిన భీకు మాథ్రే పాత్రతో పాటు జె.డి. చక్రవర్తి నటించిన సత్య పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి.
Also Read
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
- Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
ఈ సినిమాలోని పాటలు కూడా కథలో భాగంగానే సాగుతాయి. అందులో అత్యంత గుర్తింపు పొందింది ‘గోలీ మార్ భేజే మే’ పాట. ఇందులో పదే పదే వినిపించే ‘కల్లు మామ’ అనే పేరు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. దీనికి కారణం సినిమాలో నటుడు సౌరభ్ శుక్లా పోషించిన మాఫియా డాన్ కల్లు మామ పాత్ర. అతని గ్యాంగ్ సభ్యులు అతని చుట్టూ చేరి ఈ పాటను పాడే సన్నివేశం సినిమా కథనంలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. అందుకే ఈ పాటను చాలామంది అండర్‌వరల్డ్ యాంథమ్‌గా కూడా అభివర్ణిస్తుంటారు.
ఈ పాట వెనుక ఉన్న టీమ్ కూడా అంతే ప్రత్యేకం. సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటను గాయకుడు మను ఆలపించారు. ముఖ్యంగా లవ్ సాంగ్స్ కు పేరుగాంచిన దిగ్గజ రచయిత గుల్జార్ ఈ పాటకు సాహిత్యం అందించడం మరో ఆసక్తికర అంశం. ఈ పాటతో పూర్తిగా గ్యాంగ్‌స్టర్ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.
అయితే కాలం మారినా ‘గోలీ మార్ భేజే మే’ పాట క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల నటుడు సోహమ్ షా నటించిన ‘క్రేజీ ఎక్స్’ చిత్రంలో కూడా ఈ పాటను రీమేక్ చేయడం ద్వారా కొత్త తరం ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేశారు. దీంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తానికి ‘కల్లు మామ’ అనేది కేవలం ఒక పాటలోని పదం కాదు. గ్యాంగ్‌స్టర్ సినిమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక గుర్తు. 28 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటకు ఉన్న ఆదరణ, ‘సత్య’ సినిమా భారతీయ సినీ పరిశ్రమపై చూపిన ప్రభావాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి.. కేంద్ర బృందానికి సీఎం విజ్ఞప్తి..!
-
Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
-
CM Chandrababu : కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
-
CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి
-
Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!