Paruchuri Venkateswara Rao: సెంటిమెంట్ తో ఆకట్టుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగువారికి సుపరిచితులు పరుచూరి సోదరులు. మాటల గారడీతో మహా విజయాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఘనులు పరుచూరి బ్రదర్స్. వారిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. జూన్ 21న ఆయన పుట్టినరోజు. ఇటీవల కాలంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు
సందర్భంగా విషెస్ చెబుతూ చిత్రసీమలో సాగిన విధానాన్ని గుర్తు చేసుకుందాం. తెలుగు సినిమా రంగంలోనే కాదు యావద్భారతంలోనూ ఇద్దరు రచయితలు కలసి నలభై ఏళ్లుగా ప్రయాణం సాగించటం అరుదైన విషయం అనే చెప్పాలి. నలభై ఏళ్ళకు పైగా పరుచూరి వెంకటేశ్వరరావు, ఆయన తమ్ముడు గోపాలకృష్ణ కలసి ‘పరుచూరి బ్రదర్స్’గా తమదైన రచనతో జనాన్ని రంజింప చేస్తూనే ఉన్నారు. తొలి నుంచీ వెంకటేశ్వరరావు రాయడంలో ఆరితేరినవారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాస్తూ సాగారు వెంకటేశ్వరరావు. తరువాత ఏజీ ఆఫీసులో పని చేస్తూ సినిమా రంగంలో అడుగు పెట్టారు. అగ్నికి ఆజ్యంలా ఆపై తమ్ముడు గోపాలకృష్ణ కూడా తోడయ్యారు. ఇద్దరినీ కలిపి అన్న నందమూరి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి పరిచయం చేశారు. ‘అనురాగదేవత’ సినిమాలో తొలిసారి ‘పరుచూరి బ్రదర్స్’ టైటిల్ తో జనం ముందు నిలిచారు పరుచూరి సోదరులు.
‘అనురాగదేవత’ రచన చేసే సమయంలో ఏ ముహూర్తాన యన్టీఆర్ ఈ అన్నదమ్ములకు పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారో కానీ అప్పటి నుంచీ మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అప్రతిహతంగా దూసుకుపోయారు ఈ సోదరులు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ సూపర్ హిట్స్ అందించారు. కొందరు హీరోలను వీరి సినిమాలే స్టార్స్ గానూ నిలిపాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మాటల తూటాలు పేల్చడంలో, భాషా పరోటాలు పంచడంలో అన్నదమ్ములిద్దరూ చేయితిరిగిన వారు. అన్నవెంకటేశ్వరరావు సెంటిమెంట్ పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఎమోషన్ కురిపించేవారు. ఇలా ఇద్దరూ తమ కథల్లో పాత్రలకు ప్రాణం పోస్తూ సాగారు. వారి కలం నుండి
జాలువారిన సంభాషణలు తెలుగునేల నలుదిక్కులా మారుమోగుతూనే ఉన్నాయి. పరుచూరి సోదరులు రచనతో పాటు నటనలో అడుగుపెట్టారు. ఆ పై దర్శకత్వమూ చేసి అలరించారు. వెంకటేశ్వరరావు నటునిగా పలు చిత్రాల్లో తనదైన బాణీ పలికించారు. సహాయ నటుడుగా నంది అవార్డును కూడా గెలుపొందారు. ఎందరో యువ దర్శకులకు గురువులుగా సాగిన పరుచూరి సోదరుల వద్ద శిష్యరికం చేసిన వారెందరో నేడు చిత్రసీమలో అగ్రగాములుగా రాణిస్తున్నారు. జూన్ 21తో 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.
Also Read
- Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
- Ramayana: "నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది".. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
- I Am Game: జియోహాట్స్టార్లోకి దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!