Legend Saravanan: సంచలన నిర్ణయం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చాడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Legend Saravanan Preparing For Second Film: లెజెండ్ శరవణన్.. బిగ్గెస్ట్ రిటెయిల్ చైన్స్ శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఆయన, రీసెంట్‌గా ‘లెజెండ్’ అనే పాన్ ఇండియా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! నిజానికి, ఆయన ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనకడుగు వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత సమయం రావడంతో, హీరోగా అవతారమెత్తి తన చిరకాల వాంఛని తీర్చుకున్నాడు. 53 ఏళ్ల వయసులో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి, అంత లేటు వయసులో డెబ్యూ ఇచ్చిన నటుడిగా చరిత్ర సృష్టించాడు.
అయితే.. ‘లెజెండ్’ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అంతేకాదు, శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరోగా కాదు కదా, కనీసం సైడ్ క్యారెక్టర్‌కి కూడా పనికిరాడంటూ నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వత్రా ఆయనకు అవమానాలే మిగిలాయి కానీ, పాజిటివ్‌గా ఏదీ అనుకూలించలేదు. ఈ నేపథ్యంలోనే శరవణన్ ఇకపై సినిమాలు చేయకపోవచ్చని, తిరిగి తన బిజినెస్‌పై దృష్టి సారిస్తాడని అంతా అనుకున్నారు. హీరో అవ్వాలనే తన కల ‘లెజెండ్’తో తీరింది కాబట్టి, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పొచ్చని భావించారు. కానీ, అందరి అంచనాల్ని తిప్పికొడుతూ శరవణన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
కోలీవుడ్ సమాచారం ప్రకారం.. రొమాంటిక్ డ్రామా జోనర్‌లో శరవణన్ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడట! ఆల్రెడీ ఓ నూతన దర్శకుడితో చర్చలు జరగడం, కథ ఫైనల్ చేయడం జరిగిపోయాయట! త్వరలోనే ఇతర ఫార్మాలిటీస్ ముగించుకొని, గ్రాండ్‌గా అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగానే తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా కోసం, ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సో.. మరో సంచలనం త్వరలోనే రాబోతోందన్నమాట!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!