Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సౌందర్య రజినీకాంత్ ముందుగా రజనీకాంత్ హీరోగా కొచ్చయడాన్(తెలుగులో విక్రమాదిత్య అనే సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు ఆ తరువాత ధనుష్ హీరోగా విఐపి2 కూడా చేసింది.
Eagle : 7 రోజుల్లో చేయాలనుకుంటే 17 రోజులు పట్టింది.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది!
ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఇక చాలా గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఒక సాలిడ్ స్క్రిప్ట్ తో లారెన్స్ కి కథ వినిపించి, అతిథి పాత్రలో రజనీకాంత్ నటిస్తారని చెప్పగా వెంటనే లారెన్స్ స్క్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కి ఏకలవ్య శిష్యుడిగా చెప్పుకునే లారెన్స్ ఎప్పటికైనా ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటూ ఉండేవాడు. అలా చేయడానికి ఒక సాలిడ్ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో స్వయంగా రజనీకాంత్ కుమార్తె దర్శకత్వంలో సినిమా అవకాశం రావడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన కలైపులి యస్ థాను ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మేరకు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉండగా త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తోంది.