Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ గా మారిన మెగా కోడలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది మెగా కోడలిగా మారిన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా.. ? లేదా.. ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పెళ్లి తరువాత మొట్ట మొదటి ప్రాజెక్ట్ ను లావణ్య ప్రకటించింది. మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు మారిపోయింది. గతేడాది అతిథి, దయా, వధువు వంటి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..కొత్త ఏడాదిలో మిస్ పర్ఫెక్ట్ అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రతి పని పర్ఫెక్ట్ గాచేసే మిస్టర్ పర్పెక్ట్ ల గురించి మాట్లాడుకుంటుంటాం…కానీ ఇక్కడ మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది, చేయించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో హిలేరియస్ గా చూపించబోతున్నారు దర్శకుడు విశ్వక్ ఖండేరావ్.
లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మిస్ పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ స్పందిస్తూ “న్యూ ఇయర్ ను పర్ఫెక్ట్ గా మొదలుపెట్టబోతున్నాం…” అంటూ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ – “మిస్ పర్ఫెక్ట్ లాంటి ఒక యూనిక్ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మన జీవితాల్లో అనుకోకుండా ఏర్పర్చుకునే కొన్ని కనెక్షన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటాయి అనే కథతో ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా మిస్ పర్ఫెక్ట్ ను రూపొందించాం. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సిరీస్ తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. మరి ఈ సిరీస్ తో మెగా కోడలు హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!